Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

MLA Komatireddy says kcr family will go to jail
Advertisement
  • తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శ
  • కేసీఆర్ వద్ద ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకున్న వాళ్లు మాపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం
  • భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసలు బీఆర్ఎస్, బీజేపీ లేవని వ్యాఖ్య
Advertisement
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలకు కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మునుగోడులో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. కేసీఆర్ వద్ద ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకున్న వాళ్లు మాపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అసలు బీఆర్ఎస్, బీజేపీ లేవన్నారు.
Advertisement
Advertisement
Komatireddy Raj Gopal Reddy
Congress
BRS

More Telugu News